దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివే బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రంతో సహా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఖరి తెలపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ప్రతి పాఠశాలలో బాలికలకు టాయిలెట్లు నిర్మించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం కావాలని కోరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ జయా ఠాకూర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.