జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన పటాన్‌చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ 109, 448, 504, 506 3(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతియ రహదారి వెంట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్పడుతున్న భూ కబ్జాలపై వార్త రాసినందుకు.. సంతోష్ అనే రిపోర్టర్‌ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫోన్ చేసి బెదిరించారు. కాళ్లు, చేతులు నరికేస్తా.. ఎక్కవ మాట్లాడితే చంపేస్తా.. దిక్కు ఉన్నచోట చెప్పుకో అని బెదిరిస్తూనే.. అసభ్య పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిపాల్ రెడ్డి తీరుపై జర్నలిస్టు సంఘాలు, విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోద చేశారు పోలీసులు.