గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాని మోడీకి సిట్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ క్లీన్ చిట్ ను కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో సిట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసం సమర్థించింది. ఈ మేరకు పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో హింసాకాండ జరిగింది. ఇందులో సుమారు 69 మంది మరణించారు. ఈ అల్లర్లలో ఈషాన్ జాప్రీతో మరణించారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారు.
ఈ కేసుపై విచారణ జరిపిన సిట్ అప్పటి సీఎం మోడీతో సహా 64మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సిట్ తీర్పుపై ఈషాన్ జాప్రీ భార్య అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్ తీర్పును హైకోర్టు సమర్థించడంతో ఆమె సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.