తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన ₹5 ఫిక్స్డ్ డిపాజిట్ లను కొల్లకొట్టేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది కేటుగాళ్లు.కార్వాన్ యూనియన్ బ్యాంక్ లో పెద్దమొత్తంలో నిధులను ఎఫ్డిల రూపంలో గిడ్డంగుల శాఖ అధికారులు దాచారు.
అయితే అందులో ఐదు కోట్ల నిధులని ఫేక్ ఎఫ్డిల పత్రాలతో కొల్లగొట్టే ప్రయత్నం చేశారు దుండగులు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కేటుగాళ్ల ప్రయత్నం విఫలం అయింది.
కాగా ప్రస్తుతం డబ్బులు భద్రంగానే ఉన్నాయని సిసిఎస్ ఆఫీసర్స్ చెబుతున్నారు.పదిరోజుల క్రితం ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామన్నారు. నిధులు కొట్టేసే ప్రయత్నం ఎవరు చేశారో ప్రస్తుతం ఆరా తీస్తున్నామన్నారు.