కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడో యాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు. ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు సుమారు 91 రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది.
ఈ యాత్ర నిర్మల్ జిల్లా పిర్పి నుంచి ప్రారంభమై.. 39 నియోజక వర్గాల్లో 1365 కి.మీ మేర భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తుంది.మరో వైపు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా.. పాదయాత్ర కొనసాగుతుంది. 25 వ రోజుకు చేరుకున్న ఈ యాత్ర కోరుట్ల నియోజక వర్గంలో యాత్ర ఫర్ ఛేంజ్ పేరుతో పాదయాత్ర జరుగుతుంది.
ఇక ఇలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ధరణి అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ తో ప్రాణాలు కోల్పోయిన సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన 32 మందికి కాంగ్రెస్ నాయకులు హమీ కార్డులను అందజేశారు.