రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు విపరీతంగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి రోడ్ల మీద నుంచి పారుతున్నాయి.ఈ క్రమంలోనే నర్సింహుల పేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు రోడ్డు మీద ప్రమాదకర స్థాయిలో పారుతోంది.
దాంతో అటువైపుగా వెళ్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో వెంటనే కొందరు యువకులు అప్రమత్తమై విద్యార్థులను రక్షించారు.తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా యువకులందరూ స్పైడర్ మ్యాన్స్‌లా వచ్చి పిల్లలను రక్షించారంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisements