అనుకోని సంఘటనలు పరిస్థితి తారుమారు చేద్దామని చూస్తాయి. అప్పుడు ధైర్యంగా ఎవరో ఒకరు ముందుకు రావాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఆ ప్రయత్నమే మనిషులలో అతన్ని మహోన్నతుణ్ణి చేస్తుంది. గుజరాత్ లోని ఓ చిన్నారి చేసిన సాహసం అలాంటిదే.
రాజ్‌కోట్‌లో ఓ చిన్నారి సాహసం ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది. స్కూల్ బస్ డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పింది. ఆ క్షణంలో తెలివిగా వ్యవహరించిన చిన్నారి, స్టీరింగ్ అందుకొని బస్సుని కంట్రోల్ చేసింది.
దాంతో విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజ్ కోట్ లోని భరద్ పాఠశాలకు చెందిన బస్సు సాయంత్రం స్కూల్ నుంచి బయలుదేరింది. గొండాల్ ప్రాంతానికి రాగానే డ్రైవర్ గుండెపోటు వచ్చింది.
అది గమనించిన భార్గవి వ్యాస్ అనే బాలిక స్టీరింగ్ ని చేతిలోకి తీసుకొని కరెంటు స్తంభానికి ఢీ కొట్టి బస్సు ఆపింది. ఇంత సాహసం చేసిన భార్గవిని అంతా మెచ్చుకుంటున్నారు. బస్సు డ్రైవర్ హారున్ భాయ్ రాజ్ కోట్ సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.