కర్నూలు : ఒక ప్రైవేట్ స్కూల్లో థర్డ్ క్లాస్ చదివే పసివాడిపై అత్యంత కిరాతకంగా చేయి చేసుకున్న ప్రిన్సిపల్ నిర్వాకం బ్రాహ్మణకొట్కూరులో వెలుగుజూసింది. విస్‌డమ్ స్కూల్‌లో రెండురోజులు గైర్హాజరైన పాపానికి షేక్ రహమాన్ అనే బాలుణ్ని ప్రిన్సిపల్ సలీమ్ చితకబాదేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాణ్ణి తీసుకుని వచ్చి స్కూలు ముందు తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ సలీమ్ పరారీలో ఉన్నాడు. ఎమ్మెల్యే ఆర్థర్ స్కూల్ దగ్గరికి చేరుకొని విద్యార్థి పరిస్థితి తెలుసుకొని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.