యూపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కరోనా ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలలు తెరవాలనని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది.
దీంతో పాటు రాష్ట్రంలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించేలా అనుమతులు ఇచ్చింది. అయితే వాటర్ పార్కులను మాత్రం మూసివేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
‘ నర్సరీ నుంచి 8 వ తరగతి వరకు బోధించే పాఠశాలలు ఫిబ్రవరి 14 నుంచి తెరుచుకుంటాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు పనిచేస్తాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. అన్ని ప్రధాన ప్రాంతాల్లో హైల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తాము.
రాష్ట్రంలో తాజాగా 18016 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం ఉపశమనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 9 నుంచి 12తరగతుల వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యాయి. డిగ్రీ కళాశాలలు సైతం ఇప్పటికే తెరుచుకున్నాయి.