స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడు చేస్తారు… లాక్ డౌన్ అయ్యాక స్కూల్స్ ఓపెన్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం అందరిలోనూ సందిగ్దత నెలకొంది. ఇదే విషయమై కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 14 లాక్ డౌన్ ముగిసాక అప్పటి పరిస్థితుల పై సమీక్ష జరుగుతుందని.. ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయం బట్టి స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చెయ్యాలనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూల్స్ ని పునః ప్రారంభించటం కన్నా విద్యార్థులు, టీచర్స్ ఆరోగ్యమే ముఖ్యమని తెలిపారు. ఏప్రిల్ 14 తరువాత కూడా స్కూల్స్ పునః ప్రారంభం కాకపోయినా విద్యార్థులు ఎవరు నష్టపోరని…పరీక్షల నిర్వహణ, పేపర్స్ దిద్దే పనులను తరువాత అయినా పెట్టుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సీబీఎస్ఈ విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే తరువాత తరగతులకు వెళ్లేలా మానవవనరుల శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు.