కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ముందస్తుగానే సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే.. అవి ఈ నెల 16తో ముగియడంతో.. కరోనా దృష్ట్యా వాటిని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఆ గడువును మళ్లీ పొడిగిస్తారా లేదా అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దానిపై రాష్ట్ర సర్కారు ఓ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ హై కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కీలక విషయాలు వెల్లడించింది ప్రభుత్వం.
అయితే.. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు ముగియనుండటంతో.. విద్యా సంస్థల ప్రారంభంపై తీవ్ర కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలను తెరవాలనే నిర్ణయానికి వచ్చారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ రోజు విద్యాసంస్థల రీ ఓపెన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్ కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోనే విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇక, నిన్న కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు..ఈ నెల 31 నుండి పాఠశాలలు తెరుస్తారా అని ప్రభుత్వాన్ని ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.