తెలంగాణలో విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక పరీక్షలు నిర్వహించాలంటే..కనీసం మూడు నెలలైనా తరగతులు నిర్వహించాలని ఆలోచిస్తోంది.వీలైతే జనవరి 4వ తేదీ నుంచే పాఠశాలలు, జూనియర్ కాలేజీలను ప్రారంభించాలని యోచిస్తోంది. ముందుగా 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఆ తరువాత క్రమంగా ఇతర తరగతులను రెగ్యులర్‌గా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థల ప్రారంభానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ… విద్యాశాఖ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించింది.
ఆన్‌లైన్ క్లాసుల కారణంగా రాను రాను విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యాసంస్థలు తెరవాలని ఇప్పటికే ఉపాధ్యా సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్ స్కూల్, కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయానికి రానుంది.