అంగారకుడిపై నిర్మాణాలు సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అందుకు కావాల్సిన ముడిసరుకు ఎలా? అంగారకుడిపై నిర్మాణాలకు అవసరమైన వస్తువులను భూమిపై పంపడం సులువేనా?… ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా సమాధానం ఇచ్చింది. వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో పాటు గ్రహాంతర ధూళితో కాంక్రీట్ లాంటి పదార్థాన్ని రూపొందించవచ్చని ఆ బృందం వెల్లడించింది. అంగారకుడిపై మార్టిన్ కాలనీల ఏర్పాటుకు ఎదురవుతున్న అడ్డంకులు దీంతో తొలగిపోయినట్టేనని చెబుతోంది.
అంగారకుడిపైకి ఒక ఇటుకను రవాణా చేయడానికి 2 మిలియన్ యూస్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు అవుతుందని అంచనా. అంటే భవిష్యత్తులో మార్టిన్ కాలనీ నిర్మాణం చాలా ఖరీదుతో కూడుకున్నదై ఉంటుంది. కానీ మాంచెస్టర్ వర్సిటీ బృందం తాజా అధ్యయనంలో.. యూరియా (మూత్రం, చెమట లేదా కన్నీటి నుండి వచ్చే సమ్మేళనం) తో కలిపి మానవ రక్తం (మానవ సీరం అల్బుమిన్) నుంచి ప్రోటీన్‌కు అంగారకుడి లేదా చంద్రునిపై ఉన్న మట్టితో కలిపితే సాధారణ కాంక్రీటు కంటే బలమైన పదార్థం తయారు అవుతుందని ఆ బృందం స్పష్టం చేస్తోంది. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఆస్ట్రోక్రీట్ అని పిలుస్తారని ఆ బృందం వెల్లడించింది.
వారి లెక్కల ప్రకారం.. ఆరుగురు వ్యోమగాముల సిబ్బంది, అంగారకుడి ఉపరితలంపై రెండు సంవత్సరాల సమయం ఉండుంటే 500 కిలోల అధిక శక్తి గల ఆస్ట్రోక్రీట్ ఉత్పత్తి చేయవచ్చు.