యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కణాల ఆవిర్భావానికి ముందు జీవక్రియ పరిణామంలో రెండు కార్బన్ పరమాణువుల సమ్మేళనం కీలక పాత్ర పోషించినట్టు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనం వివరాలను పీఎల్ఓఎస్ బయాలజీలో ప్రచురించారు. ఈ పరిశోధనలు ప్రీ బయాటిక్ బయోకెమిస్ట్రీ ప్రారంభ దశల అధ్యయనంలో కొత్త వెలుగులు నింపింది. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఈ రోజు కణ జీవితంలోని సార్వత్రిక శక్తి కరెన్సీగా ఎలా మారిందో ఈ అధ్యయనం సూచించింది. దీని ప్రకారం….
ఏటీపీ సంక్లిష్ట రసాయన నిర్మాణాన్ని మొదటి నుండి నిర్మించడం చాలా శక్తితో కూడుకున్నది. దీనికి ఆరు వేర్వేరు దశలు అవసరం. వీటితో పాటు దీనికి ఏటీపీ కూడా అవసరం ఉంటుంది. భూమిపై జీవి పుట్టుకకు ముందు మాలిక్యుల్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. దీంతో పాటు ఏటీపీ నిర్మాణంలో కొన్ని సమ్మేళనాలు ప్రముఖ పాత్ర పోషించి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఏర్పడిన ఏటీపీ నుంచి శక్తి లేకుండా ఏటీపీ అస్థిపంజరం ఎలా ఏర్పడుతుందనే దానిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని సిద్దాంతాలను ప్రతిపాదించారు. రెండు-కార్బన్ సమ్మేళనాల అసిటైల్ ఫాస్ఫేట్ (ఏసీపీ) అనేది బ్యాక్టీరియా, ఆర్కియా రెండింటిలోనూ జీవక్రియ మాధ్యమంగా పనిచేస్తుందని వెల్లడించారు.
లాలాజలంలో దంత క్షయాన్ని కలిగించే బాక్టీరియా, శిలీంధ్రాలు కలిసి “సూపర్ ఆర్గానిజమ్స్” ను ఏర్పరుస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తీవ్రమైన దంత క్షయం ఉన్న పిల్లల నుంచి లాలా జలం నమూనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఊహించని ఆవిష్కరణను కనుగొన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో వెల్లడించారు.