ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలను మోసం చేసున్న కీచక కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన పాలమూర్తి అజయ్ అనే యువకుడు.. అమ్మాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి.. రిక్వస్టులు పెడతాడు. తరువాత పరిచయం చేసుకొని క్లోజ్ గా ఛాటింగ్ చేస్తాడు. ఇంకొంచెం క్లోజ్ అయిన తరువాత ఫిక్స్ అగిడి తీసుకొని.. తిరిగి వాటిని మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయిలకు పంపిస్తాడు. దీంతో ఏం చేయాలో తెలియని అమ్మాయిలు.. వాడు చెప్పిన మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
తరువాత న్యూడ్ పిక్స్, కాల్స్ అంటూ వేధింపులకు గురిచేస్తాడు. ఇలా చాలా మంది అమ్మాయిలను వేధించాడు. అయితే, ఇలా బలైన వారిలో ఒక అమ్మాయి 15 రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కీచకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు దిల్ సుఖనగర్ లో ఉంటూ మల్టీమీడియా చదువుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో చాలా మంది బాధితులు ఉన్నారని నిందితుడు తెలిపాడు. మరి కొంతమంది అమ్మాయిలు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.