ఎస్ ఆర్ కళ్యాణ మండపంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు సెబాస్టియన్ PC 524తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది. కిరణ్ అబ్బవరం పాత్ర కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ టైమింగ్ గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా ట్రైలర్‌ను ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో నువేక్ష, కోమలి ప్రసాద్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జోవిత సినిమాస్ బ్యానర్‌పై సిద్దారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.