భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కు సిద్దమైంది. దీంతో ఆ రోజు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సినిమాలు అన్నీ కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం రిలీజ్ డేట్ ను మార్చి 4 కు మార్చుకుంది.
ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా రిలీజ్ డేట్ ను మార్చుకున్నాడు. కిరణ్ హీరోగా నటిస్తున్న సెబాస్టియన్ మార్చి 4న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
అయితే గని యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. నిజానికి ఫిబ్రవరి 25 గాని మార్చి 04న కానీ గని సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
పవన్ దెబ్బకు రెండు సినిమాలు వెనక్కి తగ్గాయి. మరి ఇప్పుడు గని తగ్గుతాడో లేక ఫిబ్రవరి 25న సినిమాను రిలీజ్ చేస్తాడో చూడాలి.