కిరణ్ అబ్బవరం హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సెబాస్టియన్ Pc 524. ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయినట్లు తెలుస్తోంది.
ప్రైమ్ షో ఫిల్మ్స్ ఆ రైట్స్ ను సొంతం చేసుకుంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతా దండేకర్, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్నారు.
అలాగే జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం రేచీకటితో బాధపడే పోలీసుగా నటించిన సంగతి తెలిసిందే.