‘రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాగే రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మరో హిట్ ను అందుకున్నాడు. మూడవ చిత్రం ‘సెబాస్టియన్ P.C. 524’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ నైట్ బ్లైండ్‌నెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
నమ్రత దారేకర్, కోమలి ప్రసాద్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బి సిద్దా రెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రమోద్, రాజు నిర్మించారు.
నిజానికి ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, భీమ్లా నాయక్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెబాస్టియన్ PC 524 మార్చి 4న విడుదల కానుంది.
అలాగే ప్రీ-రిలీజ్ వీడియోలు, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. కాగా తాజాగా మరో కొత్త పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. కంటిలోని చీకటిని గుండెలో దాచుకుని అంటూ సాగే ఈ పాటకు గిబ్రాన్ సంగీతం అందించారు.