సెబాస్టియన్ P.C. 524 సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మొదటిసారి పోలీసుగా ఇందులో నటించాడు. రాజా వారు రాణి గారు, SR కళ్యాణమండపం లో కాలేజ్ స్టూడెంట్ గా నటించిన కిరణ్ ఈ చిత్రంలో రేచీకటితో ఇబ్బంది పడే పోలీసు పాత్రలో నటించాడు.
కాగా తాజా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మొత్తం కథ మదనపల్లె బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన కిరణ్ ను దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి సెబాస్టియన్ గా డిఫరెంట్ స్టైల్ లో చూపించాడు. ఇక ఇందులో నమ్రత దారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందించాడు.
ఆదర్శ్ బాలకృష్ణ, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్, శివ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.