అదానీ గ్రూపుపై సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) నిఘా పెట్టింది. అదానీ కంపెనీకి మారిషస్ కంపెనీలతో సంబంధాలపై సెబీ ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను అందించాలని బ్యాంకులను సెబి కోరింది. కంపెనీకి సంబంధించి విదేశీ పోర్టు పోలియో, పెట్టుబడిదారులకు సంబంధించిన వివరాలను సెబీ కోరినట్టు మార్నింగ్ కాంటెక్ట్ అనే పత్రిక పేర్కొంది.

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ అవకతవకలు, అదానీ గ్రూప్‌లో మోసం జరిగినట్లు ఆరోపిస్తూ యూస్ కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత నెలలో ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక వెలువడిన తర్వాత వాటాల విక్రయాన్ని ఆ సంస్థ నిలిపి వేసినట్టు పేర్కొంది.
ఇది ఇలా వుంటే మారిషస్‌లోని కార్పొరేట్, బిజినెస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం… 13 కంపెనీల్లో ఐదు కంపెనీల్లో డైరెక్టర్‌లు, చిరునామాలు, వాటి నిర్వహణ సంస్థలతో సహా అనేక సారూప్యతలు ఉన్నాయని ఆ పత్రిక వెల్లడించింది. మొత్తం ఐదు కంపెనీలు 20 ఏండ్ల క్రితం అదానీ గ్రూప్ స్థానిక అనుబంధ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న మారిషస్‌కు జయేచుండ్ జింగ్రీతో సంబంధాలు ఉన్నట్టు వెల్లడించింది.