ఏపీలో స్థానిక సంస్థలు నిర్వహించేందుకు ఇచ్చిన షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు సాధ్యంకాదన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది. అయితే, దీనిపై ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్తూ హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలంటూ అప్పీల్ చేయగా… హైకోర్టు వాదనలు విన్నది. అయితే, సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వకుండా సంక్రాంతి సెలవుల తర్వాత వరకు విచారణను వాయిదా వేసింది. ఈనెల 17వరకు కోర్టుకు సెలవులు ఉండగా… 18న విచారణకు రానుంది.