ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ద్విసభ్య బెంచ్ కొట్టివేయటంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం నుండి తనకు సహాకారం అందేలా చూడాలని గవర్నర్ విశ్వభూషణ్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. గతంలో తాను ఇచ్చిన గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల బదిలీతో పాటు, 11మంది పోలీసు అధికారుల బదిలీని ప్రభుత్వం చేపట్టలేదంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు తాము కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం అంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుండగా… ప్రభుత్వం కూడా హైకోర్టు నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించనుంది.