ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాకరించటం లేదని, చర్య తీసుకోవాలని కోరుతూ… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వం సహకరించటం లేదన్నారు.
సీఎస్ నీలం సాహ్ని, పంచాయితీ రాజ్ ప్రధాన కార్యదర్శి ద్వివేదిలకు తను ఎన్ని లేఖలు రాసినా సరిగ్గా స్పందించటం లేదని, కమిషన్ లోని ఖాళీలు భర్తీ చేయటం లేదని, ఫండ్స్ సమకూర్చటం లేదని నిమ్మగడ్డ కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్ దే నిర్ణయమని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం సహకరించటం లేదన్నారు.
సర్కార్ కు ఎన్నికల నిర్వహణలో తగు ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ కోరారు.