కరోనా వ్యాక్సినేషన్‌లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి కేంద్రం చేపట్టిన డ్రైరన్ రెండో విడత దేశవ్యాప్తంంగా మొదలైంది. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 736 జిల్లాల్లో ఈ మాక్‌డ్రిల్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టిన కేంద్రం.. కోల్డ్ చైన్ విధానాన్ని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. డ్రైరన్‌లో ఎదురైన సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలని.. టీకాపై అపోహలను తొలగించేందుకు అవగాహన చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు పిలుపునిచ్చింది.
ఏపీలో ఇప్పటికే నిర్వహించిన డ్రైరన్ విజయవంతంగా కాగా.. ఇవాళ మరికొన్నొ చోట్ల చేపడుతున్నారు. ఇక తెలంగాణలో 12 వందల కేంద్రాల్లో డమ్మీ టీకా వేస్తారు. ప్రతీ సెంటర్‌లో 25 మందితో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఈ డ్రైరన్‌తో కొవిన్ యాప్ పనితీరు, వ్యాక్సినేషన్‌లో సమస్యలను గుర్తించి.. వాటిని సరిచేస్తారు