తెలంగాణలో రెండో విడత రైతుబంధు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పది రోజుల వ్యవధిలో రైతుబంధు డబ్బు పంపిణీ పూర్తి చేయాలని, రైతులకు వారి అకౌంట్లలో డబ్బు జమచేయాలని నిర్ణయించారు.
డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ సాయం అందించాలని, ఇందుకోసం 7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు.