బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఒకటి కాబోతున్నారు. ఇప్పటి వరకు వేరువేరుగా వారిద్దరు గురువారం మధ్యాహ్నం జంట కానున్నారు. ఇప్పటికే ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తూ రెసిడెన్సీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు గణేశ్ పూజ నిర్వహించిన వారికి.. మధ్యాహ్నం 3 గంటలకు మెహిందీ సెర్మనీ జరుగనున్నారు. అయితే.. చాలా గోప్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఫ్యామిలీ సభ్యులతోపాటు.. రణ్‌బీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రమే హాజరవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వాస్తు బిల్డింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. ఈ వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు భద్రతా సిబ్బంది.
సోషల్ మీడియా ప్రపంచంలో సెల్ ఫోన్ లో ఫోటోలను చిత్రికరిస్తారని.. వేడుకల్లో పాల్గొనే సిబ్బంది ఫోన్లకు రెండు వైపులా ఎరుపు రంగులో ఉన్న స్టిక్కర్లు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.