హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అఖిలప్రియ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆమె కోరగా.. చంచల్‌గూడ జైలు అధికారులు సమర్పించిన మెడికల్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.
ఇదిలా ఉంటే కిడ్నాప్‌నకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలాగే కిడ్నాప్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు అఖిలప్రియను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం ఓకే చెప్పింది. పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి కోరగా… కోర్టు మూడు రోజులు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి 13 వరకూ అఖిలప్రియ పోలీస్ కస్టడీలోనే ఉంటారు.