యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో డార్లింగ్ సినిమా ఒక మైలు రాయి. ఈ సినిమాతో ప్రభాస్ కు యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చి పది ఏళ్ళు అవుతున్నా క్రేజ్ పోలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తమ్ముడి పాత్రలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించాడు. ఆ ఆర్టిస్ట్ పేరు గౌరవ్.
సెకండాఫ్ లో గౌరవ్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. గౌరవ్ వేసే పంచ్ డైలాగులు… కామెడీ టైమింగ్ అంతా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. గౌరవ్ డార్లింగ్ సినిమాల్లోనే కాకుండా శ్రీరామరాజ్యం సినిమాలో కూడా నటించాడు. నిజానికి గౌరవ్ కు చిన్నప్పటినుంచి యాక్టింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడే ఎన్నో స్టేజ్ షో లు కూడా చేశాడట గౌరవ్.
పుష్ప లో బన్నీ తల్లిగా నటించిన నటి ఎవరో తెలుసా ?
మొదట నందితాదాస్ దర్శకత్వంలో వచ్చిన ఒక డాక్యుమెంటరీలో నటించాడు. దాని పేరు ఫిరాక్. ఆ తర్వాత రవితేజ బలాదూర్ సినిమాలో నటించాడు. మొత్తం గౌరవ్ 20కి పైగా సినిమాల్లో నటించాడు. అలాగే మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా మహేష్ కు తమ్ముడి గా నటించాడు.
అయితే తనకి ఎప్పటినుంచో హీరో అవ్వాలని కోరిక ఉందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గౌరవ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. కాగా ఇండస్ట్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై చాలా మంది హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. గౌరవ్ కూడా అలా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి గౌరవ్ కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.