కొన్ని కొన్ని సినిమాల్లో బాల నటులు ఇంకా మన కళ్ళ ముందే ఉంటారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ, జై చిరంజీవ సినిమాలో బాల నటి… బంగారం సినిమాలో నటించిన చిన్నారి… ఇలా కొందరు మనకు బాగా దగ్గరయ్యారు. వీరి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. జై చిరంజీవ సినిమాలో చిన్నారి పాత్ర అయితే కన్నీళ్లు తెప్పిస్తుంది.
Also Read:సర్కారు వారి కళావతి సాంగ్ ప్రోమో… కేక !!
ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఆ సినిమాలో చిన్నారి శ్రియా శర్మ… చిరంజీవి మేనకోడలుగా నటించి ముద్దు ముద్దు మాటలతో బాగా ఆకట్టుకుంది. ఆ పాత్ర రావడం ఎంత సంతోషంగా ఉంటుందో… ఆ పాత్ర క్లోజ్ కావడం కూడా అంతే బాధగా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఆ తర్వాత సౌత్ లో, హింది లో పలు భాషల్లో నటించి ఆకట్టుకుంది.
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో రచ్చ, తూనీగా, తూనీగా సినిమాలలో టీనేజ్ అమ్మాయిగా కూడా నటించి ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ గా కూడా ఆఫర్లు రావడంతో బిగ్ బాస్ ఫేం అలీ రాజా హీరోగా వచ్చిన గాయకుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటించింది. ఇప్పుడు మోడలింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది.
Also Read:‘భళా తందనాన’ కొత్త సాంగ్ ప్రోమో