ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2018లో స్టేటస్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వాట్సాప్ యూజర్లు అప్పటి నుంచి స్టేటస్‌లను పెట్టుకుంటున్నారు. రాను రాను ఈ ఫీచర్ చాలా పాపులర్ అయింది. కొందరు రోజుకొకసారి స్టేటస్‌ను మార్చడం మొదలు పెట్టారు. ఇంకొందరు గంట గంటకు తాము ఏం చేస్తున్నారు, ఏ మూడ్‌లో ఉన్నారు.. తదితర విషయాలకు అనుగుణంగా స్టేటస్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఒకరి స్టేటస్‌ను ఒకరు ఎప్పటికప్పుడు చూస్తున్నారు. అయితే వాట్సాప్‌లో అవతలి వారి స్టేటస్‌ను మీరు చూశారని వారికి తెలియకుండా చేయవచ్చు. అందుకు అందులో ఓ సెట్టింగ్‌ను మార్చాల్సి ఉంటుంది. ఏం చేయాలంటే.
వాట్సాప్‌లో సెట్టింగ్ విభాగంలోని ప్రైవసీలో రీడ్ రిసీట్ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి. అదేమిటి.. ఈ ఫీచర్ వల్ల అవతలి వారి చాట్‌లను మనం చదివామో లేదో అవతలి వారికి తెలియదు కదా. అలాంటిది ఈ ఫీచర్‌తో పైన తెలిపిన బెనిఫిట్ ఏం జరుగుతుంది ? అని మీరు అనుకోవచ్చు. కానీ రీడ్ రిసీట్‌కే కాదు, సీక్రెట్‌గా అవతలి వారి స్టేటస్ చూసేందుకు కూడా ఈ ఫీచర్ పనికొస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడం వల్ల అవతలి వారి స్టేటస్‌ను మీరు చూసినా వారికి ఆ విషయం తెలియదు.
అయితే దీనివల్ల ఒక నష్టం ఉంది. అదేమిటంటే.. మీరు అవతలి వారి స్టేటస్‌ను చూస్తే వారికి ఆ విషయం ఎలాగైతే తెలియదో, వారు మీ స్టేటస్‌ను చూసినా ఆ విషయం మీకు తెలియదు. ఎవరు మీ స్టేటస్‌ను చూసినా ఎవరెవరు చూశారు.. అన్న విషయాన్ని మీరు తెలుసుకోలేరు. అలాగే వాట్సాప్‌లో మీకు ఇతరులు పంపే మెసేజ్‌లను మీరు చూశారో లేదో కూడా అవతలి వారికి తెలియదు. ఇలా అయినా ఓకే అనుకుంటేనే మీరు ఆ ఫీచర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు వస్తాయి.