ఏపీలో విగ్రహ రాజకీయం తారా స్థాయికి చేరుకుంది. నిత్యం ఏదో ఒక చోట విగ్రహాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థం కోదండ రాముడి విగ్రహన్ని ధ్వంసం చేశారు.
ఆ వేడి చల్లారక ముందే తాజాగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న సీతారామ మందిరంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు విరగ్గొట్టారు. అయితే సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు. మట్టితో తయారు చేసిన ఈ విగ్రహం ఎలుకలు వల్ల కానీ గాలికి కానీ కింద పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల చేరుకుని ఆందోళన చేస్తున్నారు.