తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో నిర్వహించిన సర్వోదయ సంకల్ప యాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు.. డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భూములు పంచితే.. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. పేదలకు సాయం చేయకపోగా.. వారి భూములను లాక్కొని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందని మండిపడ్డారు.
వ్యవసాయం చేసుకునేందుకు పేద ప్రజలకు భూములు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. మద్యం సేవించి యువత పెడదారిన పడుతోందని అన్నారు.
Advertisements
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు పెరిగాయని.. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నియంత్రణ చర్యలు పెట్టాలని సూచించారు సీతక్క.