వారిద్దరూ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోలు. తమదైన నటనతో తమను తాము మలచుకుని. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని,టాలీవుడ్ లో తమదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వారు మరెవరో కాదు. మాస్ మహరాజ రవితేజ, నేచురల్ స్టార్ నాని.
తాజాగా తమతమ సినిమాలతో సినీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు.టాలీవుడ్ హీరోలు రవితేజ, నాని.
ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న రెండు సినిమాలు వారం వ్యవధిలోనే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నాని నటిస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ దసరా. మార్చి 30న విడుదల కానుంది. కాగా రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్ 7న విడుదలవుతుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు సింగిల్ సిట్టింగ్‌లో డబుల్ ప్రమోషన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు.దసరా, రావణాసుర సినిమాల విశేషాలతోపాటు ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలపై మాట్లాడారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నాని, రవితేజ చిట్ చాట్‌లో పాల్గొన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మరి ఈ చిట్ చాట్ వీడియో ఎప్పుడు రిలీజవుతుందనేది చూడాలి. దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
రావణాసురలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
DHARANI x RAVANA 🤗❤️🔥 https://t.co/IiKt00uR9j
— Ravi Teja (@RaviTeja_offl) March 23, 2023