గత ఏడాది భార్య ఉరివేసుకుంటే.. వీడియో తీసిన ఓ వ్యక్తి న్యూస్ ఏపీలో సంచలనం అయింది. ఇప్పుడు అదే వ్యక్తి సెల్పీ వీడియో తీసుకొని పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకి, తన భార్య చావుకి కొంత మంది కారణం అని చెబుతూ భార్య సమాధి దగ్గర పురుగులు మందుతాగాడు. అయితే ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మొద్దు పెంచలయ్య.. తన భార్య కొండమ్మ మూడు నెలల క్రితం ఇంట్లో ప్యాన్కి ఉరివేసుకుంటుంటే వీడియో తీశాడు. అప్పుడు ఆ వార్త సంచలనంగా మారింది. పెంచలయ్య ఆ వీడియో బంధువులకు కూడా పంపిచారు. ఆత్మహత్య చేసుకుంటున్న భార్యను కాపాడకుండా వీడియో తీయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబంలో మనస్పర్థలు ఉంటే మాట్లాడి సరిదిద్దుకోవాలి కానీ.. చనిపోతున్న వ్యక్తికి చూస్తూ ఆనందించడం దారుణమని చాలా మంది మండిపడ్డారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. ఆయనకు జైలు శిక్ష కూడా పడింది. ఇటీవలే పెంచలయ్య బెయిల్పై వచ్చాడు.
ఇప్పుడు అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భార్య, తన చావుకి కొంత మంది కారణమని వారి పేర్లను కూడా చెబుతూ సెల్ఫీ తీసుకున్నాడు. తరువాత లెటర్ రాసి భార్య సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.