మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరిగిన తరువాత ఏక్ నాథ్ షిండే ను సీఎం గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలందరూ ఫుల్ జోష్ లో చిందేశారు.
దాదాపు వారం రోజులు పాటు గౌహతి లో ఉండి అక్కడ నుంచి గోవాలోని హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఏక్‌నాథ్ ప్రమాణ స్వీకారాన్ని టీవీలో చూస్తూ ఎమ్మెల్యేలు చిందులు వేశారు. సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు హత్తుకుని తమ ఆనందాన్ని చాటుకున్నారు.
ముందుగా అందరూ అనుకున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారనుకుంటే ఆయన షిండే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాను ఏ మాత్రం షిండే ప్రభుత్వంలో భాగంగా ఉండనని అన్నారు. కానీ షిండే ప్రభుత్వానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తుందన్నారు.
శివసేన లో ఉన్న ఏక్ నాథ్ షిండే కు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి ఆశ చూపించి 39 మంది రెబల్ ఎమ్మెల్యేలతో బయటకు వచ్చేటట్లు చేసిన విషయం తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య షిండే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.