పార్లమెంటులో పాలక,ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు ఆక్షేపణలతో దద్దరిల్లడం సర్వసాధారణం. కొట్టుకోవడం కొంచెం అరుదు.అయితే అదెంత భాగ్యం అనుకున్నారో ఏంటో ! వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ సెనగల్ దేశ నాయకులు. పార్లమెంట్ సాక్షిగా అధికార పక్షం, పాలక పక్షం కుమ్ములాటకు దిగి సామాన్య ప్రజల్నిముక్కున వేలేసుకునేలా చేసాయి. ప్రస్తుతం సెనగల్ చట్ట సభలో జరిగిన ఈ ముష్టియుద్దం ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ విహారం చేస్తుంది.
సెనగల్ ప్రతి పక్ష పార్టీనాయకుడు మున్సాట్ సంబ్ తోటి మహిళా ఎంపీ యామి నదియా గింబే వద్దకు వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తనను కొట్టిన మున్సాట్ సంబ్ పై యామి నదియా అక్కడున్న కుర్చీని విసిరికొట్టింది. ఈ చర్యతో చట్ట సభయుద్ధాన్ని తలపించింది.
ప్రస్తుత అధ్యక్షుడు సాల్ కు మూడోసారి కూడా పదవిని కట్టబెట్టడాన్ని ఓ ఆధ్యాత్మిక గురువు వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ఎంపీ గింబే తప్పుబట్టారు. ఆమె వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు సంబ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గింబే ఆయనను వెక్కిరించిడంతో గింబే కూర్చున్న చోటుకి వచ్చి సంబ్ ఆమెను చెంపదెబ్బకొట్టాడు.
❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague*
The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby – an MP of the ruling coalition – during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS
— Daniel Marven (@danielmarven) December 2, 2022
దీంతో పార్లమెంట్ ఫైటింగ్ రింగ్ గా మారిపోయింది.సభ రసాభాసవడంతో పార్లమెంట్ సెషన్ను సస్పెండ్ చేసారు. ఈ ఘటన శుక్రవారమే చోటుచేసుకోగా నెట్టింటింకి రావడంలో కొంతజాప్యం జరిగింది.ఇది వైరల్ అవడంతో ఆలోటు కూడా తీరిపోయి సెనగల్ ప్రజల పరువును ప్రపంచానికీడ్చాయి.గత జూలైలో ఎన్నికలు జరగ్గా అప్పటి అధికార పార్టీ ఓడిపోయింది. దాంతో సెనగల్ దేశంలో ఇరుపక్షాల మధ్య పార్లమెంటు ఉద్రిక్తలు పరిపాటిగా మారాయి.