భూమిక.. ఈ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తోంటుంది. ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు భూమిక. కొంతకాలం తెలుగు తెరకు దూరంగా ఉన్న భూమిక హీరోయిన్ పాత్రలనే కాకుండా తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంటే సినిమాలో నటించేందుకు ఒకే చెప్పేస్తోంది. అలా ఆమె చేసిన ‘సవ్యసాచి’ .. ‘ఎంసీఏ’ .. ‘రూలర్’ సినిమాల్లోని పాత్రలు మరింత పేరును తెచ్చిపెట్టాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భూమిక మాట్లాడుతూ తాను నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి వివరించింది. ఓ స్టార్ హీరో సినిమాలో తాను నటిస్తున్నాని.. ఈ సినిమాలో తన పాత్ర కీలకంగా ఉండబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భూమిక. నెగిటివ్ షేడ్స్ తో కూడిన లేడీ విలన్ పాత్ర చేస్తునట్టు పేర్కొంది. ఈ తరహా పాత్రలను చేసేందుకు చాలాకాలం నుంచి ఎదురుచుస్తున్నానని.. ఇపుడు ఆ అవకాశం వచ్చిందని చెప్పింది భూమిక. అయితే ఈ సినిమా పేరు చెప్పేందుకు ఆమె నిరాకరించారు.