మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్నవారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ తన మద్దతు మంచు విష్ణు కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ ప్రకాష్ రాజు పై నిప్పులు చెరిగారు.
Advertisements
మా సభ్యులను ప్రకాష్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నారని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు నరేష్. మా లో క్షుద్ర రాజకీయం చేయొద్దని కరోనా సమయం లో ఇబ్బందులు పడుతున్న వారికి మా ఉప్పులూ , పప్పులిచ్చిందని 300 లకు పైగా ఆసుపత్రులతో మా కు అసోషియేషన్ ఉందని అన్నారు నరేష్. ఈ విషయం ప్రకాష్ రాజ్ గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కసారైనా మా ఎన్నికల్లో ఓటేశారా ..ఒక్క మా మీటింగ్ కు అటెండ్ అయ్యారా …ఎన్నిసార్లు మానుండి సస్పెండ్ అయ్యారు… ఇక్కడికి మీరే వచ్చారా.. ఎవరైనా తెచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నరేష్.