ప్రముఖ నటి జయసుధ మూడో పెళ్లి చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొన్ని రోజులు క్రితం అమెరికా వెళ్లిన జయసుధ అక్కడ బిజినెస్ మ్యాన్ ను సీక్రెట్‌గా వివాహాం చేసుకుందని పలు వెబ్ సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశమే హాట్ టాపిక్ మా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల జయసుధ పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనే ఓ వ్యక్తి కనిపించడమే ఇందుకు కారణం.
లేటెస్ట్ గా తమిళ నటుడు విజయ్ ‘వారసుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆ వ్యక్తితోనే కలిసి హాజరయ్యారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై సహజ నటి జయసుధ రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకే ఇండియాకు వచ్చాడని స్పష్టం చేసారు.
ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి తనతోనే ఉంటూ గమనిస్తున్నాడని చెప్పారు. అంతేకాకుండా స్పిరిచ్యువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను? అంతకుముందు నా జీవితం ఎలా ఉండేది అని తెలుసుకుంటున్నాడంటూ స్పష్టం చేశారు జయసుధ. దీంతో పెళ్లి వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది.