సీనియర్ నటీమణుల్లో సహజ నటిగా పేరు పొందిన నటి జయసుధ… ఆమె సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 50 వసంతాలు నిండిన కారణంగా ఆమె తన సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని చెప్పారు. అలాగే అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై వివక్ష కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు.
“ఈ పరిశ్రమలోకి వచ్చి యాభై ఏళ్లు పూర్తయింది. ఇండస్ట్రీలో మహిళలను గౌరవించే విషయంలో గొప్ప మార్పులేం జరగలేదు.హీరోలు, పురుషులకు మాత్రం చాలా మర్యాదలు జరుగుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ పైనా వివక్ష ఉంటుంది. నేను కూడా కఠినమైన డిమాండ్లతో ఉంటే ఇన్నేళ్లు ఇక్కడ ఉండేదాన్ని కాదు. అన్నింటికీ కాంప్రమైజ్ అవుతూనే ఇంత దూరం ప్రయాణం చేశా” అని వివరించారు.
అదే ముంబై నుంచి వచ్చే హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తారన్న ఆమె… ఆఖరికి వారి కుక్క పిల్లలకు కూడా రాచమర్యాదలు చేస్తారని, మనవాళ్లను మాత్రం చులకనగా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేసారు. చివరగా ఎవరెవరో కాంట్రవర్సీలు చేసేవాళ్లకు పద్మశ్రీ ఇచ్చారంటూ నటి “కంగన “పేరు ప్రస్తావించడం విశేషం.