అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో ఫుల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మన్ననలు కూడా పొందాడు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉండగా విజయ్ కు రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సామాన్యులే కాదు సినీ స్టార్స్ సైతం విజయ్ ని లైక్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న అన్నమయ్య ఫేమ్ కస్తూరి తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని విజయ్ తో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.
తాజాగా సీనియర్ నటి మాళవిక సైతం విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్ అంటే తనకు ఇష్టమని తెలిపింది. ఆలీతో సరదాగా షో లో మాట్లాడిన మాళవిక తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవలే ఆమని, రోజా, ఇంద్రజ వంటి సీనియర్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు.ఈ సినిమాతో పాటు పూరితో జనగణమన సినిమా కూడా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి లైగర్ కన్నా ముందు షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు.