రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ద్విచక్ర వాహనాలు అంటే చాలా మంది బైక్ ప్రియులకు ఇష్టమే. వాటిని చాలా మంది ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. వాటిపై జాలీగా రైడ్‌కు వెళ్తుంటారు. ఇక విదేశాల్లోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లు పేరుగాంచాయి. ఈ క్రమంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను చాలా మంది భిన్న రకాలుగా మోడిఫై కూడా చేసుకుని ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా బుల్లెట్ లేదా క్లాసిక్ 350 వాహనాలను మోడిఫై చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు కూడా తన బుల్లెట్‌ను పూర్తిగా 3 వీలర్ గా మార్చేశాడు.
చిత్రంలో కనిపిస్తున్నది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఏబీఎస్ మోడల్ వాహనం. దాని ముందు భాగం అలాగే ఉంది. కానీ వెనుక భాగలో మరో 2 వీల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఆ వీల్స్‌ను వెనుక నుంచి వచ్చే చైన్‌కు కనెక్ట్ చేశారు. ఇక ముందు భాగంలో ట్యాంక్, ఇంజిన్‌లు కుడి భాగంలో ఉన్నాయి. దీంతో బైక్‌పై సౌకర్యవంతంగా కూర్చునే వెసులుబాటు కలిగింది. ఈ విధంగా ఆ వాహనాన్ని ఆ వృద్ధుడు మార్చేశాడు. ఈ క్రమంలోనే తన బైక్‌పై తన భార్యను కూర్చోబెట్టుకుని ఢిల్లీలో ఓ రహదారిపై ప్రయాణిస్తుండగా.. ఓ ట్యూబర్ ఆ బైక్‌కు చెందిన వీడియోను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనాన్ని అలా మార్చడంతో దాన్ని రహదారిపై చూసిన చాలా మంది ఆ బైక్‌ను ఆపి వివరాలను తెలుసుకోవడం మొదలు పెట్టారు. చాలా ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా బైక్ కనిపించింది. దీంతో చాలా మందిని ఆ బైక్ ఆకట్టుకుంది. ఇక ఆ బైక్ ధర రూ.1.75 లక్షలు ఉండగా దాన్ని మోడిఫై చేసేందుకు రూ.1.25 లక్షలు పట్టిందని ఆ వృద్ధుడు తెలిపాడు. తన భార్యతో తిరిగేందుకే ఆ వాహనాన్ని అలా మార్చానని తెలిపాడు.
Watch Video: