రాశికన్నా ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బొల్తాకొట్టడంతో ఆమెకు చేతిలో సినిమాలేవీ లేకుండా పోయాయి. అయితే, డైరెక్టర్ మారుతీ నెక్ట్స్ సినిమాలో రాశికన్నాకు అవకాశం ఇవ్వాలని చూశారు. మారుతీ- రవితేజ కాంభినేషన్ లో సినిమా రావాల్సి ఉన్నప్పటికీ, రవితేజ సినిమా నుండి తప్పుకోగా హీరోగా గోపిచంద్ నటిస్తున్నారు.
అయితే, గోపిచంద్ సరసన కూడా రాశికన్నాను తీసుకోవాలని అనుకున్నారు. కానీ గోపిచంద్ మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర హీరోయిన్లను ట్రై చేద్దాం అని చెప్పేసినట్లు ఇండస్ట్రీ టాక్. రాశికన్నాతో గోపిచంద్ జిల్, ఆక్సిజన్ మూవీ చేయగా… ఆ రెండు బొల్తా కొట్టాయి. ఇక రాశికన్నా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, వెంకీ మామ, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలు కూడా హిట్ కొట్టలేకపోవటంతో రాశికన్నా ను గోపిచంద్ దూరం పెడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.