ఈ నెలాఖరుతో ఏపీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా ఎవర్నీ నియమిస్తారు అన్న సస్పెన్స్ కు సీఎం జగన్ తెరదించారు. కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాథ్ దాస్ ను నియమించాలని నిర్ణయించారు. వైఎస్ హాయం నుండి ఆదిత్యనాథ్ కు జగన్ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి.
ఇక సీఎస్ నీలం సాహ్ని సేవలను వినియోగించుకునేందుకు గాను ఆమెను సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎంవోలో కీలక అధికారిగా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలను ఇక నీలం సాహ్నికి అప్పగించబోతున్నారన్న ప్రచారం సాగుతుంది. ఆయన్ను కేంద్ర సర్వీసులకు పంపబోతున్నారని వస్తున్న ఊహాగానాలను ఇప్పుడు మరింత బలం చేకూరినట్లయింది.