ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఆయన లేఖ రాశారు. త్వరలోనే క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి… మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆయన ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని వెంకటేశ్వరరావు విమర్శించారు. తనకు పోస్టింగ్ కూడా ఇవ్వటం లేదన్నారు. హుటాహుటిన ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో వివరించారు.
టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ అధికారంలోకి రాగానే సస్పెండ్ చేశారు.