అయ్యో ఇదెక్కడి సిత్రం !
సారు కారు సూపరు కదా…గిదెంది కారుకు కంకి కొడవలి గుర్తొచ్చింది!
దొరకు సలి జరం వొస్తున్నట్టుంది..!
సారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు కమ్యూనిస్ట్‌లకు కాలం చెల్లిందని….మరి గిదేంది..?
సీపీఐ నాయకులు ఆలోచించి చెప్తరట.
ఏమన్నా సిగ్గుందా కామ్రేడ్..
నువ్వు ఇంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నినించినొడివైతే
మాట మార్చకుండా కుదరదు అని చెప్పాలి.
అలోచించి చెప్తావా?? ఎం ఆలోచిస్తావ్ కామ్రేడ్ …
పోడు భూముల సమస్య పరిష్కారం కానందుకు ఆలోచిస్తావా?
రైతులను బెదిరించి భూములు లాక్కున్నందుకు ఆలోచిస్తావా??
కౌలు రైతులను అసలు మీకు ప్రభుత్వంతో సంబంధం లేదు అన్నందుకు ఆలోచిస్తావా ?
రైతులకు బేడీలు వేసినందుకా?
డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టనందుకా?
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకా?
ఉద్యోగులను కుక్క తోకతో పోల్చినందుకా?
3లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తిన పెట్టినందుకా?
జ్వరాలతో ప్రజలు సస్తున్నందుకా?
అడిగినోడు అన్నీ మర్చిపోయాడు. మరి నీకేమైంది ? అలోచించి చెప్పేంత ఏముందని కామ్రేడ్ ?
అభివృద్ధి కోసమనే ‘ కారు ‘ కూతలు కూస్తే… ప్రజలు ఖతం చేస్తరు కామ్రేడ్..
-జర్నలిస్ట్ రఘు