దేశంలో అశ్లీల వెబ్‌సైట్‌లు నిషేధించటంతో… అందుకు సరిపడ బూతుపురాణం వినిపించే బూతు సైట్లలో మన గలీజు ఆంధ్రా కూడా ఒకటి. బిల్డప్‌తో, బూతులతో, రంకు రాతలతో… వార్తలను అమ్మి, సొమ్ము చేసుకొవటం గలీజు ఆంధ్రాకు కొత్తేం కాదు. అయితే, రాతలు శృతిమించి… ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
సూర్యూనిపై ఉమ్మితే ఏం జరుగుతుంది. మన మొహం మీదే పడుతుంది. ఇప్పుడు గలీజు ఆంధ్రా పరిస్థితి కూడా అలాగే ఉంది. బూతు రాతలు రాసుకుంటూ, నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ… నీ పని నువ్వు చేసుకోక, ఎదుటివారిపై బురద జల్లాలనుకునే ప్రయత్నం ఎందుకు?. తమ ఆటలు సాగించుకునే కుట్రలో భాగంగా మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు. కానీ జైలులో అలా జరిగింది, ఇలా జరిగింది అంటూ చిల్లర వార్తలతో… బూతు పురాణం వినిపించారు.
దీంతో జైలు అధికారులు సీరీయస్ అయి… తమపై ఇలాంటి చిల్లర వార్తలు రాస్తే ఊరుకునేది లేదని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఇటు రవిప్రకాశ్ తరుపు లాయర్లు కూడా లీగల్ నోటీసులు పంపి… వెంటనే వార్తను తొలిగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటు జైలు అధికారులు, అటు రవిప్రకాశ్ నుండి లీగల్ నోటీసులు అందటం, మరోవైపు సభ్యసమాజం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఓ సీనీయర్ జర్నలిస్ట్‌పై పిచ్చి రాతలు రాస్తూ, పైత్యాన్ని ప్రదర్శించటంపై మండిపడింది. జర్నలిస్ట్‌లు అయితే… ఇది జర్నలిజమా…? ఇలాంటి బూతు సైట్ల వల్లే జర్నలిజం చచ్చిపోతుందని, విలువ లేకుండా పోతుందని మండిపడ్డారు.
దీంతో ఇంటా-బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో…. బూతు ఆంధ్రా స్పందించి, వెంటనే మీడియా లెజెండ్ రవిప్రకాశ్ పై రాసిన వార్తను తొలగించింది. కానీ క్షమాపణ మాత్రం చెప్పలేదు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో క్షమాపణ చెప్పని పక్షంలో…. లీగల్‌గా ప్రొసిడ్ అవుతామని ముందే చెప్పినందున, ఇక లీగల్‌గా వెళ్లేందుకే రెడీ అయ్యారు రవిప్రకాశ్ లాయర్లు.