అక్రమ కేసులతో మై హోమ్ రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి నన్ను జైల్లో పెట్టామని పండగ చేసుకుంటున్నారు. వారి రాక్షసానందానికి అంతిమ వీడ్కోలు తప్పదు. అమాయక పోలీసుల్ని వాడుకుంటూ రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకొని మీరు ఆడుతున్న మహా నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కేసుల మీద కేసులు పెట్టి జైల్లోనే ఉంచాలన్న మీ దుర్మార్గపు ఆలోచన జర్నలిజం సంకల్పాన్ని రెట్టింపు చేస్తోంది. వందల కేసులు నా మీద పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. మీ అరాచకాలకు చరమ గీతం పాడే వరకు నా పోరాటం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మీరు చంపేస్తున్న జర్నలిజాన్ని బతికించడమే నా లక్ష్యం. రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకొని మీరు ఇవాళ ఆట ఆడొచ్చు…అదే ప్రజలు మీ బాగోతం తెలిసి తిరుగుబాటు చేస్తే… ఫలితం ఒక్కసారి ఆలోచించండి. జర్మనీ ప్రజల తిరుగుబాటుతో హిట్లర్ తనంతట తానే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అణచివేత మొదలైతే తిరుగుబాటు కూడా మొదలయినట్టే. మీ ఆటలు సాగవు.