మీవి కూడా బతుకులేనారా...? - Tolivelugu

మీవి కూడా బతుకులేనారా…?

senior journalist sathish kamal opinion on telangana rulers for their suppressing real heroes for their sake, మీవి కూడా బతుకులేనారా…?

సతీష్‌ కమల్, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ నాయకుడు

1200 మంది అమరుల త్యాగాలతో అధికారాన్ని అందుకున్నారు.అధికారం దక్కింది మొదలు అక్రమం చూళ్ళేదు…సక్రమం చూళ్ళేదు…బినామీల సునామీతో వందలు, వేల కోట్ల రూపాయలు దోచుకుని దాచుకున్నారు. కానీ…ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచిపని కోసం మీ ఇంటి ఖజానా నుంచి తీసి ఖర్చు పెట్టారా…?

కనీసం దశాబ్దాలుగా మీకు రాజకీయ భిక్ష‌ పెడుతున్న నియోజకవర్గానికో ఆసుపత్రి అయినా కట్టలేకపోయారు…
రవిప్రకాష్ అనే ఒక సామాన్యుడు అసామాన్య రీతిలో మరో చరిత్రగా ఎదిగి…మీకు చేతకాని ప్రజోపయోగ కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొస్తే కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు…కడుపు నిండా నింపుకున్న విషాన్ని మీ మీడియా మాఫియా ముఖంగా వెళ్ళగక్కుతూ పేద ప్రజలకు ప్రాణాలు పోసే ఆ ఆసుపత్రి ఉసురు తీయడానికి బరితెగించారు.మీ ఇలాఖాలో మీ చేతుల మీదుగా ఒక సరస్వతి నిలయానికి నీడనిచ్చిన మంచితనానికి ప్రతిగా తప్పుడు కేసులతో జైలుకు పంపేదాకా మీ శాడిస్టిక్ ఈగో వదల్లేదు.

ఒక సాధారణ ‌జర్నలిస్టు చరిత్ర సృష్టించేలా వెన్నంటి నిలిచిన సమాజానికి తనకు చేతనైనంతలో తిరిగి ఇవ్వగలిగిన విజనరీ జర్నలిస్టు రవిప్రకాష్ ను చూసి సిగ్గు పడండిరా… కొండలుగా పెంచుకున్న సంపదను అభాగ్య ప్రజలతో పంచుకోవడానికి వీలుగా మీ మనసుల్ని విశాలం చేసుకోండిరా..

ఇక్కడ ఒక విషయం క్లియర్…
మీ పాపం పండాలంటే మీ అరాచకాలు ఇలాగే కొనసాగాలి.
ఈ గడ్డ మీద లక్ష కోట్లు దోచుకున్నోడు కూడా నయా పైసా వెంట తీసుకెళ్ళలేదు.
కర్మసిధ్ధాంతం ఏం చెప్తుదంటే నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికే వచ్చి మిగిలిపోతావు.
ఆ మిగిలేది చరిత్రపురుషుడిగానా…చరిత్రహీనుడిగానా అన్నది నువ్వు చేస్తున్న కర్మలు డిసైడ్ చేస్తయి.

So get ready for the destiny…

Share on facebook
Share on twitter
Share on whatsapp